చంద్రబాబు పాదయాత్ర ప్రజలకోసం, రాజకీయంకోసం కాదు: హరికృష్ణ

హిందుపురం: చంద్రబాబు యాత్ర ప్రజల కోసం, రాజకీయం కోసం కాదు అని సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి హిందుపురం చేరుకున్న హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణపై తాము చెప్పాల్సింది చేప్పామని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని అన్నారు. తెలంగాణ ఇస్తామన్నది, చస్తామన్నది కాంగ్రెస్సేనని ప్రజటు వాళ్లనే నిలదీయాలని హరికృష్ణ అన్నారు.