చంద్రుడిని ఢీకొట్టిన జంట ఉప గ్రహాలు

ఆ ప్రాంతానికి అమెరికా తొలి వ్యోమగామి పేరు

కాలిఫోర్నియా : చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న జంట ఉపగ్రహాలను నాసా చంద్రుని ఉత్తర ధ్రువం వద్ద ఉన్న పర్వత ప్రాంతంలో ఢీకొట్టించింది. 30 సెకండ్ల తేడాతో రెండు ఉపగ్రహాలు చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టించింది. 30 సెకండ్ల తేడాతో రెండు ఉపగ్రహాలు చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టాయి.. ఏడాదిపాటు విజయవంతంగా సేవలు అందించిన ఈ ఉపగ్రహాలను చంద్రుడి కింద ఏముందో తెలుసుకోవడానికి నాసా ప్రయోగించింది. ఉపగ్రహాలు చంద్రున్ని ఢీకొన్ని ప్రాంతానికి గత సంవత్సరంలో మృతిచెందిన అమెరికా తొలి మహిళా వ్యోవగామి సాలీ రైడ్‌ పేరును గౌరవసూచకంగా పెట్టాలని నాసా నిర్ణయించింది.