చదువుల తల్లి ఒడిలో… జయ్యారం సర్కార్‌ బడి విద్యార్థులు

బసంత్‌నగర్‌, మే 27, (జనం సాక్షి) :

రామగుండం మండలంలోని జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి విద్యాసంవత్సరం విజ యకేతనం ఎగురవేస్తున్నారు. ప్రతి యేడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల స్థాయిల్లో జయ్యారం ప్రభు త్వ పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానంలో ఉంటు న్నారు. అంతకుముందు మండల, జిల్లా స్థాయిల్లో పలు కార్యనిర్వాహక సంస్థలు నిర్వహించే… ప్రతిభా పోటీల్లో సైతం ఈ పాఠశాల విద్యార్థులే… ముందుంటున్నారు. విద్యాపరంగానే కాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని విద్యా వేత్తల కితాబును అందుకున్నారు. ఈ పాఠశాల్లో 2003 విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి ప్రారంభం కాగా, ఇప్పటివరకు 500లకు పైగా మార్కులను సాధించి విజయవిహారం చేస్తున్నారు. 2003లో పొన్నం సతీష్‌(515), 2004లో ఆడేపు శ్రీధర్‌(526), 2005లో భీమని సత్యనారాయణ (515), 2006లో ఆడేపు మహేష్‌ (539), 2007లో ఆడేపు శ్రీవాణి (526), 2008లో పొన్నవేణి గణపతి (535), 2009లో ఆవులం నవీ న్‌కుమార్‌(547), 2010లో అనుమం డ్లఅంజనేయులు(551), 2011లో నరేష్‌(9.7) ఇలా… విద్యార్థులు తమ సత్తాను చాటుతున్నారు. అయితే గత ఐదేండ్లుగా ప్రతి యేడాది… ఐఐఐటీిలో ఈ జయ్యారం పాఠ శాల విద్యార్థులను మండలాధికారులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమం ప్రభుత్వ విద్యారంగంలో జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చరిత్ర ను సృష్టిస్తున్నారు. కాగా, ప్రభుత్వ విద్యాశా ఖాధికారుల ప్రోత్సాహంతో… అధ్యాపకుల కృషి తో… విద్యార్థుల కష్టంతో… జయ్యారం ప్రభుత్వ పాఠశాల జిల్లా విద్యారంగ చరిత్ర పుటల్లో నిలిచి పోయిందని… గతంలో… ప్రస్తుతం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఎం.శ్రీనివాస్‌, స్వర్ణలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతియేడాది ఈ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో సాధిస్తున్న ఫలితాల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.