చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తిరుపతిలో అడ్డుకున్న పోలీసులు

తిరుపతి: సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తిరుపతిలో పోలీసులు అడ్డుకున్నారు. ఎస్వీయూ పరిపాలనా భవనం నుంచి రైల్యే స్టేషన్‌కు ప్రదర్శనగా బయల్దేరిన విద్యార్థులను గేటు వద్దే పోలీసులు అటకాయించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో వారందరినీ అదుపులోకి తీసుకుని వ్యానులోకి ఎక్కించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు.