చార్జీల పెంపు స్వల్పమే : ఎకె ఖాన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఆర్టీసీ చార్జిలను స్వల్పంగానే పెంచామని ఆ సంస్థ ఎండి ఎకె ఖాన్‌ అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకే పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆర్టీసీకి ఏడాదికి 352 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పెంచిన చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయన్నారు. త్వరలో 2 వేల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.