చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఎదుట మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసిన కనకయ్య మృతి చెందాడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆర్థరాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కనుకయ్య స్వస్థలం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లా కాగా గత కొద్ది రోజులుగా హైదరాబాద& బల్కంపేట ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.