చిదంబరానికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మద్రాస్‌ హైకోర్డులో కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నిల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాట్‌ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. 2009  లోక్‌సభ ఎన్నికల అక్రమాల కేసుపై విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.తన ఎన్నికను సవాలు చేస్తూ రాజా కన్నప్పన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ చిదంబరం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజా కన్నప్పన్‌ పిటిషన్‌ విచారణ ఎదుర్కొనవలసిందేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.