చినగంజాంలో ముగ్గురు సజీవదహనం

చినగంజాం: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అడవీధిపాలెంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అన్పా చెల్లెళ్లయిన సుబ్రహ్మణ్యం, రోజా, వారి మేనకోడలైన కీర్తన గ్రామంలోని ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తన చెల్లెలు రోజాకు వివాహేతర సంబంధముందన్నా అనుమానంతో సుబ్రహ్మణ్యం ఆదివారం మధ్యాహ్నం కిరోసిన్‌ పోసి ఇంటిని తగులబెట్టాడు. దీంతో ఇంటిలో ఉన్న రోజూ, కీర్తన, సుబ్రహ్యణ్యంలు సజీవ దహనం అయ్యారు.