చిన్నతనంలో విద్యార్థులకు పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు
మల్దకల్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో బాలల హక్కులు ,బాల్యవివాహాలు,బాల కార్మికుల గురించి అవగాహన కల్పించారు.మెడికల్ ఆఫీసర్ సుప్రీత మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామన్నారు, పిల్లలకి ఎలాంటి సమస్య వచ్చినా 1098 ఆ నెంబర్ కాల్ చేయాలన్నారు. ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పడం జరిగింది.
మల్దకల్ ఎస్సై శేఖర్ మాట్లాడుతూ టోల్ ఫ్రీ నెంబర్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవి చాలా ముఖ్యము ఆపదలో ఉన్నప్పుడు 100 నెంబర్ కు కాల్ చేయండి మా సిబ్బంది తప్పనిసరిగా వస్తారని చెప్పారు.ఎక్కడైనా పిల్లలకు సమస్య ఉన్న సరే 1098 నెంబర్ కు కాల్ చేయండిఅని చెప్పడం జరిగింది.షీ టీం కూడా మహిళల కోసం పనిచేస్తుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ ఆఫీసర్ నరసింహ, నవీన్,కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు, అవుట్ రిచ్ వర్కర్ ప్రకాష్ అదేవిధంగా ఆయుష్ కరదీపికను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హోమియోపతి మెడికల్ ఆఫీసర్ జయమ్మ, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, హోమియోపతి ఫార్మసిస్టు మహేశ్వరి,ఏఎన్ఎం కల్పన, ఆయుర్వేదిక్ ఎస్ ఎన్ ఓ రాము తదితరులు పాల్గొన్నారు.