-->

చిన్నవెంకులు కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు ఫోటోరైటఫ్ చిన్న వెంకులు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న పాత్రికేయులు

 పెన్ పహాడ్. సెప్టెంబరు 26 (జనం సాక్షి) : మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన జడ్పిటిసి మామిడి అనిత మామ, టిఆర్ఎస్ నాయకులు మామిడి చిన్న వెంకులు గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుమారులు మాజీ వైస్ ఎంపీపీ మామిడి వెంకటయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మామిడి అంజయ్య కుటుంబాలకు సోమవారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ప్రగాఢ  సంతాపం తెలిపి, పరామర్శించారు అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఒగ్గు సోమన్న, గౌరవ అధ్యక్షులు ధనియా కుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి నాగేశ్వరరావు గౌరవ సలహాదారులు చలిగంటి పుల్లారావు,పాత్రికేయులు చట్టు వెంకటేశ్వర్లు,నల్ల గంతుల సైదులు, మీసాల నాగయ్య, మచ్చా మహేష్, గంగారపు  హరికృష్ణ, బోలికొండ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు..