చురుగ్గా కదులుతున్న అల్పపీడన ద్రోణి

రాష్ట్రంలో జోరందుకున్న వర్షాలు
విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణకోస్తాకు అనుకుని దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించింన అల్పపీడన ద్రోణి చురుగ్గా కొనసాగుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నట్లు వివరించారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చల్లదనం ఆవరించింది. బుధవారం రాత్రి వరకు కూడా కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.
నమోదైన వర్షపాతం:
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నందిగామ, పరకాల, షాద్‌నగర్‌లో 7 సెం.మీ.లు. ఉయ్యూరు, సత్తెన్నపల్లిలో 6, హకింపేటలో, కోడేరులో, ధవళేశ్వరం 5, హైదరాబాద్‌ , గోల్కోండ, రామాయంపేట, బాన్సువాడ, చిన్నూరు, భువనగిరి, నిజాంసాగర్‌, వెంకటాపురం చొప్పున వర్షం కురిసిందన్నారు.