చెట్టును ఢీ కారు కొని ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

నర్సింహులపేట,మే26(జనంసాక్షి) : మండలంలోని బీరుశెట్టిగూడెం శివారు పంతులు తండా వద్ద కారు అదుపు తప్పిన చెట్టును ఢీ కొని ఒక్కరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై వినయ్‌ కుమార్‌ కథనం ప్రకారం ఖమ్మం నుండి వరంగల్‌ ఇండికా కారు నెంబర్‌ ఎపీి20ఎఎ4567 లో ఫంక్షన్‌ వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొనడంతో విక్రందేవరెడ్డి (32) అక్కడిక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న విక్రందేవ రెడ్డి కూతురు తన్వీర (3), తల్లితండ్రులు భాస్కరదేవ రెడ్డి(50), విజయదేవరెడ్డి( 40), జ్యోతి (25)లకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని వారికి మహబాద్‌ ఎరియా అస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.