చెత్త ఎత్తడం నిలిపివేయిస్తాం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే 28 నుంచి హైదరాబాదులో చెత్త ఎత్తడాన్ని నిలిపివేయిస్తామని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. సీమాంధ్ర నేతలు విభజనను అంగీకరించాలని, నీటి సమస్య అయితే మాట్లాడుకుందామని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు లగడపాటి  జోకర్‌ వేషాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ విషయంలో  రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదని తీవ్రమూన ఉద్యమానికి సిద్ధమవుదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.