చెన్నూరులో సీపీఐ రాస్తారోకో
కడప: బ్రహ్మణిని రద్దు చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని జిల్లావ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా చెన్నూరు బస్‌స్టాప్ వద్ద సీపీఐ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


