చెన్నై విమానాశ్రయంలో 8.2 కేజీల బంగారం పట్టివేత

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ఇద్దరు ప్రయాణీకులు అక్రమంగా తరలిస్తున్న 8.2 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణీకులు వేరువేరుగా ఒకరు రియాద్‌ నుంచి, మరొకరు మస్కట్‌ నుంచి బంగారాన్ని తరలిస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారం విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని వారు తెలిపారు.