చెరువులో పడి ఒకరి మృతి

భైంసా: మండలంలోని సిద్దూర్‌ గ్రామంలో ఎడ్లను చెరువులో స్నానం చేయించేందుకు వెళ్లి విఠల్‌ అనే రైతు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారమందుకున్న భైంసా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.