చెరువుల శుద్ధికి శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌:నగరంలో చెరువుల శుద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. మిషన్‌ కాకతీయలో భాగంగా అల్వాల్‌లోని చెరువుల్లో వీడ్‌హార్‌వెస్టర్‌ను ఉపయోగించి గుర్రపు డెక్క, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. మరి కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒక రోజులో దాదాపు 3 ఎకరాలు ప్రాంతాన్ని వీడ్‌హార్‌వెస్టర్‌ శుద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.