చెలరేగిన గేల్: అస్ట్రేలియా టార్గెట్ 192 పరుగులు
కొలంబో: ఆస్ట్రేలియా ముందు వెస్టిండ్‌స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్రిస్ గెల్ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. మర్లోన్ శామ్యూల్స్ కూడా అర్థ సెంచరీ సాధించాడు. వాట్సన్ క్రిస్ గెల్‌ను అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఊపరి పీల్చుకుంది. గెల్ 54 పరుగులు చేసాడు. అందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై టాస్ గెలిచి వెస్టిండ్‌స్ కెప్టెన్ డారెన్ సామీ బ్యాటింగ్ ఎంచుకుందిజ. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ డీ గ్రూప్‌నకు సంబంధించి వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య కొలంబోలోని ప్రేమదాన స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. వెస్టిండ్‌స్‌పై గెలిస్తే ఆస్ట్రేలియా సూపర్ 8లో అడుగు పెడుతోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, వెస్టిండీస్‌ను ఓడించడం బెయిలీ బాయ్స్‌కు అంత సులభమేమీ కాదు. బ్యాటింగ్‌లో క్రిస్ గేల్‌ను కట్టడి చేయడం, బౌలింగులో సునీల్ నరినేను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు కాస్తా ఇబ్బందికరమైన విషయమే. షేన్ వాట్సన్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఐరిష్‌పై ఆస్ట్రేలియా సునాయస విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచులో గేల్ లేని వెస్టిండీస్ జట్టు అంతగా రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బాగా కనిపించింది.