చెస్ట్ ఆస్పత్రి తరలింపును నిలిపివేయాలి: హైకోర్టులో బీజేపీ నేత నాగం పిల్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 జనంసాక్షి : చెస్ట్ ఆస్పత్రిని తరలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ పాలన చూస్తుంటే భయం కలుగుతోందని ఆయన అన్నారు. హెరిటేజ్ భవనాలను కూల్చవద్దని నిబంధనలు ఉన్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే ప్రజాకంటక నిర్ణయాలను ఎదురించిగలిగే విధంగా ప్రజలలో చైతన్యం రావాలని నాగం పేర్కొన్నారు.