చేపల చెరువుల రైతులను ఆదుకుంటాం: సీఎం

విజయవాడ: చేపల చెరువుల రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన మండవల్లి మండలం చావలిపాడులో చేపల చెరువు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అక్టోబర్‌ నెలాఖరులో చేపలచెరువు రైతులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.