చేరువలో… సింగరేణి ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని, ఆగస్టు 1 (జనంసాక్షి):సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం చేరువలో ఉంది. వర్షా భావం వల్ల ఉత్పత్తి లక్ష్యా న్ని సంపూర్ణంగా చేరుకోవ డానికి ఆటంకం ఏర్పడు తోంది. ఈ మేరకు ఆర్జీ-1 బొగ్గు ఉత్పత్తిని బుధవారం అధికారులు ప్రకటించారు. అదే విధం గా సింగరేణి వ్యాప్తం గా జరిగిన ఉత్పత్తిని సైతం వివరించారు. ఆర్జీ-1 పరిధిలో జులై మాస ంలో 5,42,600టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 4,25,990టన్నులను ఉత్పత్తి చేసినట్లు ఆర్జీ-1 అధికార ప్రతినిధి సి.మల్లయ్యపంతులు తెలిపారు. 79శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామన్నారు. వర్షాభావం వల్ల మేడిపల్లి ఓసిపిలో ఉత్పత్తికి ఆట ంకం కలగడంతో కొంతమేరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేమన్నారు. అలాగే… ఆర్జీ-1లో ఏప్రిల్‌ 2012 నుంచి జులై 2012 వరకు 21,76,900 ఉత్పత్తి లక్ష్యానికి గాను 18,78,702టన్నుల బొ గ్గు ఉత్పత్తిని సాధించి, 86శాతం లక్ష్యాన్ని సాధిం చినట్లు తెలిపారు. కాగా, సింగరేణిలోని 11ఏరి యాల్లో రోజువారీగా 1,60,926టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,00,648టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని, 1,12,309 టన్నుల బొగ్గును పంపిణి చేసినట్లు అధికారికి ప్రకటనను సింగరేణి విడుదల చేసింది.

అదేవిధంగా జులై నెలలో సింగరేణి వ్యాప్తంగా 41,98,200టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 37,41,284టన్నులను ఉత్పత్తిని చేసి 89శాతానికి చేరుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2012 నుంచి జులై 2012 వరకు సింగరేణిలో 1,70,42,600టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,54,05,363టన్నులను సాధించామని, ఈ ఉత్పత్తి క్రమం 90శాతంగా ఉందని పేర్కొన్నారు. గతేడాది ఈనెలల్లో జరిగిన ఉత్పత్తితో పోలిస్తే సమానంగా ఉందన్నారు. కాగా, పదవీ విరమణ పొందిన కార్మికులకు ఎటువంటి జాప్యం లేకుం డా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తున్నా మన్నారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసు న్నట్లు పేర్కొన్నారు. రక్షణ చర్యలను పనిస్థలాల్లో పటిష్టం చేస్తున్నామన్నారు.

ఆర్జీ-3లో ఉత్పత్తి ఆశాజనకం…

సెంటినరికాలనీ:

ఆర్జీ-3లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉంద ని… జీఎం సిహెచ్‌.నరసింహారావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జులై నెలలో 4,13,000టన్నుల లక్ష్యానికి గాను 3,70,739టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిం చామని, 90శాతం ఉత్పత్తిని సాధించగలి గామన్నారు.

రోజువారీగా 15,885టన్నుల లక్ష్యా నికి గాను 5,355టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు పేర్కొన్నారు. సంపూర్ణ ఉత్పత్తిని సాధించడానికి కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో అధికారులు అబ్బాస్‌, సాల్మన్‌రాజ్‌, శేషయ్య, వణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.