చేర్యాల పట్టణ అభివృద్ధికి 40లక్షలు మంజూరు

ఎమ్మెల్సీ పోచంపల్లిని కలిసిన టీఆర్ఎస్ పాలకవర్గం
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : చేర్యాల పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 40లక్షల సీడీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు టీఆర్ఎస్ పురపాలక సంఘం పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పురపాలక సంఘం వార్డు సభ్యులు ఇచ్చిన వినతి మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పట్టణంలోని పలు వార్డుల అభివృద్ధి పనులకు 40లక్షల సీడీఎఫ్ నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవిషయమై చేర్యాల పురపాలక సంఘం చైర్మన్ అంకుగారి స్వరూపరాణి-శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, యాట కనకమ్మ, జుబేదా ఖాతున్ లు మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి కార్యలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వార్డుల అభివృద్ధి పనులకు కావాల్సిన 40లక్షల రూపాయలను సీడీఎఫ్ నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.