చైనాలో పేలిన ఇంధన ట్యాంకర్‌…20 మంది మృతి

బీజింగ్‌: దక్షిణ చైనాలోని గాంజ్యువా పట్టణంలో ఇంధనంతో కూడిన ఓ ట్రక్కు పేలడంతో 20 మంది మృతి చెందారు. చైనా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం సుమారు 40 టన్నుల ఇంధనంతో కూడిన ఓ ట్యాంకర్‌ ట్రక్కును ఢీకొనడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు దాటికి చెలరేగిన మంటలు సమీపంలోని కలప పరిశ్రమను తాకాయి. క్షతగాత్రులలో ఎక్కువ మంది ఈ పరిశ్రమకు చెందిన కార్మికులే ఉన్నట్లు న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.