ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఈ నెల 8 , 9వ తేదీల్లో ఢీల్లీలోని జంతర్ మంతర్ వద్ద టిఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు మాదిగ పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద ఛలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ , హామీ అమలులో విఫలమైందని విమర్శించారు.ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి  చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు జానయ్య , జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రావణ్, కత్తి ఉపేందర్ , బొడ్డు మల్సూర్ , యడవెల్లి రాము , గుడెపురి ఉపేందర్, శంకర్, సత్యం, నాగయ్య, నాగేందర్, శ్రీను, సాయి , యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.