ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్‌ కు పిలుపునిస్తమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు వట్టి దద్దమ్మలు అని ఆయన విమర్శించారు. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ మంత్రులు స్పందించకపోవడం దురదృష్టకరం.