ఛార్జీలు పెంచడం మా ఆఖరి ప్రత్యామ్నాయం : ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తమ వద్దనున్న ఆఖరి ప్రత్యామ్నాయమని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. ఈరోజు ఆయన సంస్థ ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి ముఖ్యమంత్రితోభేటీ అయ్యారు డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీపై ఏడాదికి రూ. 715 కోట్ల అదనపు భారం పడిందని ఖాన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా పన్నులు అమలుచేయాలని ముఖ్యమంత్రికి తెలిపినట్లు ఆయన అన్నారు.