జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్‌

హైదరాబాద్‌ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో జరిగిన పోరుసభలో సుష్మా స్వరాజ్‌ పరకాలలో కొండా దంపతుల గూండాయిజం, వాళ్ల పార్టీ నాయకుడు జగన్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. సుష్మా వైఖరిని చూస్తే బీజేపీ వైఎస్సార్‌సీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు అర్థమవుతుందని ఆరోపించారు.