జగన్‌ కేసులో నిందితుల బెయిల్‌పై వాదనలు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందింతులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై వాదనలను నాంపెల్లిలోని  సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విజయరాఘవ బెయిల్‌పై వాదనలను ఈ నెల 1కి వాయిదా వేస్తోన్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. మరో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌పై కూడా ఈ నెల 16కు వాయిదా వేసినట్టు వెల్లడించింది.