జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో చట్టవిరుద్ధంగా తాను బెయిల్‌కు అర్హుడినేనంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలు ముగిసిన నేపథ్యంలో జగన్‌ తరపు న్యాయవాదులు గురువారం తమ వాదనలు వినిపించారు. జగన్‌ను వివిధ కేసుల్లో సీబీఐ అరెస్టు చూపించిందని కేవలం వాన్‌పిక్‌ వ్యవహారంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు దర్యాప్తు చేస్తున్న సంస్థ వాదనల్లో వాస్తవం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు జగన్‌ స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేసింది.