జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు చేసిన 4 ఛార్జిషీట్లలో జగన్‌ అక్రమాస్తుల విలువ రూ. 1595 కోట్లుగా ఉందని  సీబీఐ తరపు నాయ్యవాదులు కోర్టుకు తెలియజేశారు. సీబీఐ సమర్పించిన ఆఫిడవిట్‌ను పరిశీలించాక వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 28న ఇరు పక్షాల వాదనలు వినేందకు కోర్టు అంగీకరించింది.