జనంసాక్షి సర్వేలో … పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం


శ్రీగణనీయంగా చీలని తెలంగాణ ఓట్లు
శ్రీమహబూబ్‌నగర్‌ పాచిక విఫలం
శ్రీవిజ్ఞత ప్రదర్శించిన తెలంగాణవాదులు
శ్రీపార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు
వరంగల్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :  పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపొందడం ఖామయని తేలిపోయింది. మంగళవారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైంది. పోలింగ్‌కు ముందుగానే జనం సాక్షి సర్వే కూడా టీఆర్‌ఎస్‌దే విజయమని ముందే చెప్పేసింది. అదే ఇప్పుడు నిజం కాబోతోంది. నిజంగానే పరకాల ఓటర్లు విజ్ఞత ప్రదర్శించారు. తెలంగాణవాదుల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా అందరూ ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. పరకాల ప్రజలను ప్రలోభపెట్టేందుకు సమైక్యవాద పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మతతత్వంతో ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీని ఓటర్లు దూరంగానే ఉంచారు.మహబూబ్‌నగర్‌  పాచిక పరకాలలో పారలేదు. మతతత్వాన్ని రెచ్చగొట్టడం   గ్రామీణ ప్రాంతాల్లో సాధ్యం కాదనే విషయం కమలనాధులకు పరకాలలో తెలియవచ్చింది.