జనం సాక్షి కథనానికి స్పందించిన అధికారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 22 (జనం సాక్షి) :-
గోవిందరావుపేట మండల కేంద్రంలోని కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం పడిగాపులు కాస్తున్న బాధితులకు జనం సాక్షి పేపర్లో కథనం ప్రచురించడంతో స్పందించిన అధికార యంత్రాంగం మండల తాసిల్దార్ ఎంపీడీవో స్థానిక జడ్పిటిసి తుమ్మల హరిబాబు చల్వాయి గ్రామ సర్పంచి ఈ సం సమ్మయ్య గారి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు జనం సాక్షి ప్రచురించిన నందుకు జనం సాక్షి ప్రింట్ మీడియా కు కృతజ్ఞతలు తెలియజేశారు జనం సాక్షి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగానికి మరియు మండల స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఎట్టకేలకు కల్యాణ లక్ష్మి చెక్కులు గోవిందరావుపేట మండలం లోని
సెప్టెంబర్ 22 బుధవారం లబ్బి దారులకు ఎమ్మార్వో రాజకుమార్ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఎంపిడిఓ స్థానిక జెడ్పిటిసి తుమ్మల హరిబాబు ఎంపీటీసీ లు మరియు గ్రామ సర్పంచి ఈసం సమ్మయ్య చేతుల మీదగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మార్వో ఎంపీడీవో జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ లు గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఫోటో