జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ కృషి
హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జన చైతన్య ట్రస్టు సభ్యులు తెలిపారు. హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నా షేక్. కాశీమా అనే 68సంవత్సరాల వృద్దురాలికి భర్త చనిపోయి 10 నెలలు గడుస్తున్నా వృద్యాప్య పించెను రాక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యుల దృష్టికి రావడంతో జనచైతన్య ట్రస్ట్ తరుపున మంగళవారం 25కేజీల బియ్యం పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని మావంతు బాధ్యతగా జన చైతన్య ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకొని వారికి అండగా ఉంటామన్నారు. మా ట్రస్ట్ తరుపున కార్యక్రమానికి సహాకరించిన పబ్బా సాయిపవన్ ని ట్రస్ట్ సభ్యులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపారాళ్ళ వంశీ, అధ్యక్షులు పారా సాయి, ఉపాధ్యక్షులు పిల్లి శివశంకర్, సెక్రటరీ దగ్గుపాటి రమేష్, బీవీ శ్రీపతి, అహ్మద్, కాశీ విశ్వనాధ్, కుక్కడపు సాయి తదితరులు పాల్గొన్నారు.