జనవరి 17 నుంచి అంతర్జాతీయ వైద్య సదస్సు

హైదరాబాద్‌: నగరం మరో అంతర్జాతీయ వైద్య సదస్సుకు వేదిక కానుంది. 28వ ఆసియా పసిఫిక్‌ అకాడమీ ఆప్తమాలజీ సదస్సు  ఈ నెల 17 నుంచి 20 వరకు నగరంలో జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ కార్యాక్రమంలో భాగంగానే 71వ అఖిల  భారత కంటి వైద్యుల సంఘం సమావేశం కూడా జరుగుతుందని నిర్వాహక ఉపాధ్యక్షుడు డాజ ఎన్‌. ఎన్‌. రెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 10 వేల మంది అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు హాజరవుతారన్నారు. కంటి వైద్యంలో అంతర్జాతీయంగా వస్తున్న పురోగతి, తాజా పరిణామాలపై ఈ సదస్సులో చర్చిస్తామని ఆయన చెప్పారు.