జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. వాంగట్ అటవీ ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించాయి. ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని, సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి.



