జలదిగ్బంధంలో సోమరం గ్రామం.

జనం సాక్షి, సైదాపూర్. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద పోట్టేత్తడంతో మండలంలోని సోమరం గ్రామం  జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి అనుకొని ఉన్నటువంటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది ప్రమాదక స్థాయిలో ప్రవహిస్తున్న వాగు కల్వర్టునుండి రోడ్డుపై నుండి భారీగా ప్రవాహం కొనసాగుతుంది. ఈ గ్రామానికి చుట్టు వాగులే ఉండడంతో గ్రామానికి రాకపోకలు, సత్సంబంధాలు తెగిపోయాయి. ఎగువన ఉన్న గొలుసు కట్టు చెరువులు నిండి మత్తడి పడడంతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గ్రామస్తులు భయం భయంగా కాలం గడుపుతున్నరు. ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఇంతవరకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఇదే గ్రామానికి ఎగ్లాస్పూర్ సోమవారం పెద్దవాగు కల్వట్టు పై నుండి మీటర్ ఎత్తున ప్రవహించడంతో అటు నుంచి కూడా రాకపోకలు బంద్ అవడంతో గ్రామస్తులు రెండు వైపుల నుండి వాగులు ఉదృతంగా ప్రవహించడంతో గ్రామస్తులు ఎటు వాగు దాటలేనీ పరిస్థితులు నెలకొన్నాయి.