జలయజ్ఞం ప్రజెక్టులపై సమావేశం

హైదరాబాద్‌: భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జలయజ్ఞం ప్రాజెక్టులపై లేక్‌వ్యూ అతిధిగృహంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రెండేళ్లలో ఆంధ్ర ప్రాంతంలో 12, రాయలసీమలో 14, తెలంగాణ జిల్లాల్లో 24 ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసేందుకు దాదాపు 12వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు మంత్రులకు నివేదించారు.