జాడాల మౌనదీక్ష

విజయవాడ: సమస్యలు పరిష్కరించటంలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ 5రోజులపాటు వివాధ కార్యక్రమాలు చేపట్టిన జూడాల ఈరోజు సిద్దార్థ వైద్య కళాశాలలో మౌనదీక్ష చేపట్టారు. గ్రామీణప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నా మెరుగైన వసతులు కల్పించి, మహిళా వైద్యులకు రక్షణ కల్పించటానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిచకపోతే అత్యవసర సేవలు నిలిపివేస్తామని, రోగులకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతవహించాలని జూనియర్‌ వైద్యులు అన్నారు.