జాతీయ పోటీలు మళ్లీ వాయిదా

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లా కేంద్రంలో జరగాల్సిన జాతీయ పోటీలు మరోసారి వాయిదా పడ్డాయి. గత డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో జరగాల్సిన ఖోఖో, కబడ్డీ పోటీలు అక్బరుద్దీన్‌ అరెస్టు కారణంగా  వాయిదా పడ్డాయి. తిరిగి ఫివ్రబరి మాసంలో జరపాలని నిర్ణయించారు. ఫిబ్రవరి మాసంలో సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున జాతీయ స్థాయి పోటీలను నిర్వహించలేమని ప్రకటించడంతో ఫిబ్రవరి 5 నుంచి జరగాల్సిన పోటీలు రెండవసారి వాయిదా పడ్డాయి. ఈ జాతీయ పోటీలను  ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

తాజావార్తలు