జాతీయ రహదారిపై ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు దగ్ధం

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని మల్లేపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన ఆగివున్న  వాహనాలను ఓ వ్యాను ఢీ కొనడంతో నిప్పురవ్వలు చెలరేగాయి, వ్యాన్‌లో రసాయన పదార్థాలు ఉండటంతో మంటలు భారీగా వ్యాప్తించాయి. ఈ ఘటనలో రెండు వ్యాన్‌లు, ఐదు లారీలు పూర్తిగా దగ్థమయ్యాయి. ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఘటనాస్థలికి  అగ్నిమాపక శకటాలు చేరుకోవడానికి ఆలస్యమైంది. నష్టం రూ. కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.