జాతీయ స్థాయి శిబిరానికి బిచ్కుంద విద్యార్థిని ఎంపిక

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీ జెడ్ సి తృతీయ సవంత్సరము చదువుతున్న మౌళిష్క అనే విద్యార్థిని 2022- 2023 నకు తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించబడే అడ్వెంచర్ క్యాంపుకు ఎన్నిక కావడం జరిగిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రముఖర్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అడ్వెంచర్ క్యాంప్ హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి ప్రాంతంలో ఉంటుందని అందుకు ఈ విద్యార్థి గురువారం రోజున నిజామాబాద్ నుండి బయలుదేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వై సంజీవరెడ్డి, డాక్టర్ జి .వెంకటేశం, అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.