జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కరీంనగర్‌ : పట్టణ పరిధిలోని భగత్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ పై ఆరవ అంతస్తు పెంట్‌ హౌజ్‌ నిర్మిస్తున్నారని ప్లాట్ల యాజమానులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ నగర పాలక కమిషనర్‌ టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అపార్టుమెంట్లపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెంట్‌ హౌజ్‌లను నిర్మాణంతో మంచినీళ్లు, లిఫ్ట్‌ వాడకం, టెర్రస్‌ వినియోగం, పార్కింగ్‌ స్థలాలు లేక ఫ్లాట్లలో ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇలాంటి కట్టడాలు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం భగత్‌నగర్‌లోని మిత్ర మాన్షన్‌ అపార్ట్‌మెంట్‌పై ఉన్న అక్రమ కట్టాడాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు టీపీఎస్‌ మాజీద్‌ అలీ, టీపీబీవోలు సయీదుద్దీన్‌, రాణి, బాబు, కొండయ్య లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.