జీవవైవిధ్య సదస్సుకు రూ. 125 కోట్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. ఇందులో ఎక్కువ మొత్తం నగర సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజి ఆధునీకరణకు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు జీహెచ్‌ఎంసీ, ఇతర మార్గాల ద్వారా వచ్చిన నిధులతో కలిపి దాదాపు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధిపనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ కృష్ణబాబు తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం కూడా పరిశుభ్రమైన నగరంగా పేరుతెచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఇక నుంచి జీహెచ్‌ఎంసీ నిర్ధేశించిన చోట మినహా ఎక్కడ చెత్త వేసినా 10వేల జరిమానా విధిస్తామని చెప్పారు. జీవవైవిధ్య సదస్సుకు వస్తున్న అతిధులు తిరిగే 125 కిలోమీటర్ల రహదారులను సుందరీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.