జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ హెవ్‌వర్త్‌ పత్రిక వెబ్‌సైట్లో పేరొన్నారు.ఆయా రంగాల్లో మార్పులు ఒక చిన్న పత్రికను స్వతంత్రంగా నడవడం సాధ్యం కాకుండా చేశాయని ఆయన వాపొయారు.గత ఏడాదే పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.’ద వర్డ్‌ జులై నెల సంచిక చివరి సంచిక కానుంది.