జూక్కల్ మార్కండేయ మందిరంలో ఉగాది వేడుకలు


జుక్కల్ ,మార్చి22, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలోబుదవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి బోడ సాయిలు మాట్లాడుతు షడ్రుచుల పచ్చడి సేవనం ఆరోగ్యానికి ఔషధం లాంటిదన్నారు.పచ్చడి తయారీలో ప్రకృతి పరంగా లభించే వేప పువ్వు,మామిడి పిందేలు, కొత్త చింత పండు,బెల్లం,మిరియాలు,సయింద్రవలవణం,తదితర వస్తువులతో చేసిన షడ్రుచుల పచ్చడి ఔషధం లాగ పనిచేస్తుందని అన్నారు, మనిషికీ నిత్యజీవితంలో ఉపయోగ పడే పంచాంగ శ్రవణం, ద్వాదశరాశుల ఫలితాలు,థితి ,వార, నక్షత్రాల గురించి పండితులు వివరించారు. అందరికీ షడ్రుచుల పచ్చడి పంపిణీచేశారు.ముఖ్య అతితులుగా జుక్కల్ సర్పంచ్ రాములు సేట్, ఏఎంసి మాజీ చైర్మన్ సాయగౌడ్,ఉపసర్పంచ్ భాను గౌడ్ లు, హా జరయ్యారు.కార్యక్రమంలో సంఘ నాయకులు ఉపులంచె శంకర్, ఉపులంచె హన్మాండ్లు, మెర్గె పండరి,ఉపులంచె రమేష్, కోడిచిరె అంజయ్య, దోమల్ సుభాష్,నాగభూషణం, యు.లక్ష్మణ్,డాక్టర్ సత్యం,బాలయ్య,రాములు,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.