జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవాలు అందించటానికి సరైన మార్గదర్శకాలు లేవని గత 3రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల ఎన్టీయర్‌ హెల్త్‌యూనివర్శిటీని ముట్టడించి ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. మా సమస్యలు వీసీ పరిష్కరించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వీసీ చెప్పటంతో జూడాలు ఆందోళన విరమించారు.