జూన్ 8న భారీ బహిరంగ సభ:ఏపీ సర్కార్…

హైదరాబాద్:రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జూన్ 8న భారీ బహిరంగ సభ వేదికను ప్రభుత్వ ఖరారు చేసింది. ఈ బహిరంగ సభను ప్రభుత్వం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏడాది పాలన, ఆర్థిక ఇబ్బందులు, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు.