జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు టూరిజం ఫార్కును అందంగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (దినం సాక్షి);

జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు టూరిషం పార్క్ ను అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం రేవులపల్లి డ్యాం సమీపంలోని టూరిసం పార్క్ 70 ఎకరాలలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టూరిషం పార్క్ పనులను మ్యాపు ద్వారా పరిశీలించారు. నక్షత్ర పార్క్, ఫుడ్ కోర్ట్, పార్కింగ్, చిల్డ్రన్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్ , సైన్స్ పార్క్ , బెంచీలు, లాన్ , ఫ్లోరింగ్ , పెయింటింగ్ ఇతర పనులపై జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మ్యాపు ప్రకారం కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజెపి డ్యాం పరిశీలించేందుకు వచ్చే పర్యాటకులకు అణువుగా టూరిజం పార్క్ ఏర్పాటు చేయడం , అన్ని ఇతర వసతులు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. పార్కులో బెంచీలు అవెన్యూ ప్లాంటేషన్ ఇతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏఈ హనుమంతు రావు, నర్సిరెడ్డి కాంట్రాక్టర్ ,ప్రతాపరెడ్డి, కళ్యాణ్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.