జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతం నుంచి 1,25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాలా ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 1,12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 318.45 అడుగులుగా ఉంది.