జూలైలో జాతీయ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు

హైదారాబాద్‌ : జాతీయ సాకర్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జూలై 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌ జరగనున్నట్టు ఇండియన్‌ సాకర్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ బీడీ వర్మ తెలిపారు. ఫెడరేషన్‌, రాజీవ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. గచ్చీబౌలి స్టేడియంలో జరగనున్న ఈ పోటీలకు 18 రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని వర్మ తెలిపారు. వాస్తవానికి ఈ పోటీలు ఇదే నెలలో జరగాల్సి ఉండగా, ఉప ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్టు వర్మ తెలిపారు.